E- Books ఆదిమూల క్రియా యోగము

book cover

నా గురు దేవులు శ్రీ రంజిన్ ముఖర్జీ గారు ఆంగ్లములో ఎనిమిది భాగములుగా Original Kriya Yoga పేరుతో ఉన్న గ్రంథమాల ను రచించారు, దానిని తీయ్యని తెలుగులో అనువదించే అదృష్టము ఆ గురువుల పాదపద్మముల నుంచి నాకు లభించింది. అందులో ఈ పుస్తకము మొదటి భాగము.

— శ్రీమతి మద్దిరాల పద్మ విజయ లక్ష్మి.

Click on the link below to buy the e-book:

https://store.pothi.com/book/ebook

క్రియాయోగ సాధన

యోగ సాధనలో ముఖ్యమైనవి ఎనిమిది సూత్రాలు వీటిని ‘పతాంజలి యోగ సూత్రాలు’ లేదా ‘అష్టాంగ యోగ సూత్రాలు’ అంటారు. యమము – ఇంద్రియ నిగ్రహము, నియమము – ఖచ్చితమైన నిబద్ధత లేదా శిక్షణ, ఆసనము – సరైన ఆసన భంగిమ (కూర్చొనే విధానం), ప్రాణాయామము – ప్రాణాన్ని నియంత్రించడము, ప్రత్యాహారము – ఇంద్రియ ఉపసంహరణ, ధారణ – మనస్సును ఒక వస్తువు మీద కానీ, ఆలోచన పై కానీ కేంద్రీకరించడము, ధ్యానము – దాదాపుగా శాశ్వత సత్యములో లయమైపోవడము, సమాధి – ఈ స్థితిలో సాధకుడు పూర్తిగా పరతత్వంలో లీనమైపోతాడు, దానితో ఒకటైపోతాడు, దీనినే సమాధి స్థితి అంటారు. ఈ ముఖ్యమైన ఎనిమిది సూత్రాలు క్రియయోగంలో మరియు రాజ యోగంలో ఒకే విధంగా ఉన్నాకూడా క్రియాయోగంలో మరికొన్ని అంశాలు చేర్చబడ్డాయి, అవి ముద్రలు, మరికొన్ని ప్రత్యేకమైన సాంకేతిక పద్ధతులు.

క్రియాయోగము యొక్క రహస్యము

క్రియా యోగము యొక్క రహస్యము, దానికి ఆధారంగా ఉన్న మనస్సు, బుద్ధి యొక్క పరిధికి అవతల ప్రాణాన్ని గమనిస్తూ, జీవాత్మ పరమాత్మలో ఐక్యము అవ్వడంలోనే ఉంది.  కనుక, మొదట, ప్రతి ఒక్కరూ క్రియాసాధనను వెన్నులోని శక్తి కేంద్రాలైన ఐదు చక్రాలను ఉపయోగించి చేయాలి.  ఒక చక్రము తర్వాత మరొకటి అలా ఛేదించుకుంటూ చివరకి ఆజ్ఞాచక్రము ఛేదించడం జరుగుతుంది.  అలా ఆజ్ఞాచక్రము ఛేదించడం ద్వారా షట్చక్ర క్రియ పూర్తవుతుంది.  ఆ తరువాత బుద్ధి క్షేత్రము మరియు పరమ క్షేత్రంలో క్రియ మొదలవుతుంది.